రుణమాఫీ కానివారికి అలెర్ట్

Agriculture Minister Thummala Nageswara Rao has given another good news
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న రైతు రుణమాఫీ కాని రైతులకు మరో శుభవార్తని తెలిపారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ “ఎన్నికష్టాలున్నా రైతు రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు.
‘ఇప్పటికే 2 విడతలు అమలు చేశాము..ఈ నెల 15న రెండు లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని వైరాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తారు. పాస్ బుక్ లేకపోయినా తెల్లకార్డు ద్వారా మాఫీ చేస్తున్నాము .
కొన్ని కొన్ని సాంకేతిక కారణాలతో 30వేల మంది అకౌంట్లలో డబ్బులు జమ కాలేదు. వారు ఎలాంటి ఆందోళన పడొద్దు. పొరపాట్లు సరి చేసి అర్హులకు లబ్ధి చేకూరుస్తాము ‘ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు.
