నటి రోహిణి సంచలన వ్యాఖ్యలు

 నటి రోహిణి సంచలన వ్యాఖ్యలు

Rohini Actor

జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్ట్‌ దేశవ్యాప్తంగా ఎంతగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కమిటీ ఇచ్చిన నివేదికతో వేధింపులకు గురైన నటీనటులు ధైౖర్యంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మీడియా ఎదుట తమ సమస్యలను తెలియజేస్తున్నారు. దాదాపు ఏడేళ్లపాటు శ్రమించి జస్టిస్‌ హేమ కమిటీ ఈ నివేదికను సిద్థం చేసింది.

మలయాళ సినీ పరిశ్రమలో మహిళల ఎదుర్కొంటున్న సమస్యలు, వర్కింగ్‌ కండీషన్లు, రెమ్యూనరేషన్‌, సాంకేతిక రంగంలో మహిళల భాగస్వామ్యం తదితర అంశాలను అధ్యయనం చేసిన కమిటీ.. క్యాస్టింగ్‌ కౌచ్‌ మొదలు వివక్ష వరకు మాలీవుడ్‌లో మహిళలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ఈ రిపోర్ట్‌ వైరల్‌గా మారిన తరుణంలో పలువురు నటీమణులు మీడియా ముందుకు వచ్చి తమకు ఎదురైన వేధింపులు బయటపెట్టారు.

ఈ నేపథ్యంలో ఈ రోజు ఆదివారం జరిగిన నడిగర్‌ సంఘం మీటింగ్‌లో నటి రోహిణీ పాల్గొన్నారు. హేమ కమిటీ రిపోర్ట్‌ను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ” లైంగిక వేధింపుల గురించి మీడియా ముందుకు వచ్చి మాట్లాడవద్దని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *