నటి కస్తూరి వివాదస్పద వ్యాఖ్యలు
ప్రముఖ సీనియర్ నటి కస్తూరి తెలుగు వారి గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ “300ఏండ్ల కిందట తమిళ రాజుల అంతఃపురంలో రాణులకు సేవ చేయడానికి వచ్చిన వారే తెలుగు వారు.
ఇప్పుడు వాళ్ళు మేము తమిళులం అని నినాదాలు చేస్తున్నారు. ఆమె ఇంకా మాట్లాడుతూ ” డీఎంకే మంత్రివర్గంలో ఐదుగురు తెలుగు మంత్రులున్నారు..
ఇతరుల భార్యలపై కన్నేయ్యద్దని బ్రాహ్మాణులు చెబుతున్నందుకే వాళ్లను టార్గెట్ చేస్తున్నారు. కరుణానిధి కుటుంబం ఏపీ నుండి తమిళనాడుకు వలస వచ్చారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.