రాజకీయాల్లోకి నటి..!
ఇటీవల సీనియర్ స్టార్ హీరోయిన్.. చెన్నై భామ త్రిష కూడా పొలిటికల్ ఎంట్రీకి ఆసక్తిగా ఉన్నట్లు తెలిపిన విషయం తెలిసిందే.
తాజాగా తెలుగు, తమిళ భాషల్లో విలక్షణ నటిగా పేరొందిన వరలక్ష్మీ శరత్ కుమార్ తన పొలిటికల్ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు దివంగత తమిళనాడు సీఎం జయలలితే స్ఫూర్తి .. తప్పకుండా తాను కూడా జయలలిత గారి మార్గంలో నడుస్తూ త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానని తెలిపారు.
అయితే అందుకు ఇంకా సమయం ఉందని వరలక్ష్మీ శరత్ కుమార్ చెప్పారు. ఆమె తండ్రి.. ప్రముఖ నటుడు శరత్ కుమార్ కూడా AISMKని స్థాపించి తర్వాత బీజేపీలో విలీనం చేశారు.