వయనాడ్ బాధితులకు అండగా హీరో సూర్య

Actor suriya helps to victims of wayanad kerala
కేరళలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు… వరదల కారణంగా చాలా మంది నిరాశ్రయులవుతున్న సంఘటనలు మన నిత్యం చదువుతూనే ఉన్నాము.. రాష్ట్రంలో వయనాడ్ జిల్లాలో కొండ చరియలు విరిగిపడి వేలాది మంది ప్రాణాలు వదులుతున్నారు..
కొన్ని వేల మంది నిరాశ్రయులు అవుతున్నారు.. వీరికి అండగా సినీ రాజకీయ ప్రముఖులు ముందుకు వస్తున్నారు.. తాజాగా ప్రముఖ హీరో సూర్య ఆపన్న హస్తం అందించారు. సూర్య కుటుంబం యాభై లక్షల విరాళం ప్రకటించింది.
ఈ మొత్తాన్ని నటుడు కార్తీ, సూర్య సహచరిణి జ్యోతిక ముగ్గురు కల్సి కేరళ ముఖ్యమంత్రి సహాయానిదికి అందజేశారు.. ఈ సంఘటనల్లో చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబాలకు ఆ దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నట్లు ఎక్స్ లో వెల్లడించారు..
