కల నెరవేర్చుకున్న సర్ఫరాజ్ ఖాన్
బెంగుళూరు వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో అదిరిపోయే ఆడిన తరువాత తాను అభిమానించే ప్లేయర్ల నుంచి అభినందనలు రావడంపై యంగ్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ సంతోషం వ్యక్తం చేశారు.
‘కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, గంభీర్ సార్ లాంటి పెద్ద ఆటగాళ్లు నేను బాగా ఆడానని చెప్పడం ఎంతో గర్వంగా ఉంది.
చిన్నప్పటి నుంచి విరాట్ భయ్యాని చూస్తూ ఆయన్ను అనుసరించేవాడిని. ఇప్పుడు ఆయనతో కలిసి ఆడటం, డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడంతో నా కల నెరవేరినట్లైంది’ అని తెలిపారు.రెండో ఇన్నింగ్స్ లో సర్ఫరాజ్ ఖాన్ 150పరుగులు చేసిన సంగతి తెల్సిందే..