మాజీ మంత్రి జోగి రమేష్ ఇళ్లపై ఏసీబీ దాడులు
 
			                ACB raids on the houses of former minister Jogi Ramesh
 
ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీ కి చెందిన నేత..మాజీ మంత్రి జోగి రమేశ్ కు చెందిన పలు ఇండ్లపై ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
ఈ రోజు ఉదయమే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి చేరుకున్న 15 మంది ఏసీబీ సిబ్బంది ఆయన ఇంట్లో ఉన్న పలు ఫైళ్లను పరిశీలిస్తున్నారు.
ఇటీవల సీఐడీ స్వాధీనం చేసుకున్న అగ్రిగోల్డ్ భూములను కబ్జా చేశారనే ఆరోపణలతో జోగి రమేష్ మరియు అతని కుటుంబీకులపై కేసు నమోదైంది. ఈ వ్యవహారంలోనే ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం
 
                             
                                     
                                    