నిరాశపర్చిన అభిషేక్ శర్మ

Abhishek Sharma
అందివచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవడంలో ఘోరంగా విఫలమవుతున్నాడు టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ. బంగ్లాదేశ్ జట్టుతో మూడు టీ20ల సిరీస్ కు ఎంపికైన అభిషేక్ శర్మ గత మూడు మ్యాచుల్లోనూ విఫలమై నిరాశపర్చాడు.
ఈ సిరీస్ లో వరుసగా 16,15,04 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపర్చాడు. దీంతో అంచనాలకు తగ్గట్లు అతడు రాణించకపోవడంతో నెటిజన్లు.. క్రికెట్ ప్రేమికులు మండిపడుతున్నారు.
అంతర్జాతీయ కేరీర్ లో వచ్చిన అవకాశాలను అభి వృధా చేసుకుంటున్నారని వారు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే ఆడితే అభి కేరీర్ ప్రమాదంలో పడే అవకాశముంటుంది. మరోసారి టీమిండియా జట్టులో స్థానం లభించడం కష్టమేనని అభిప్రాయపడుతున్నారు.
