అదరగొట్టిన అభిషేక్ శర్మ…!

ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్ జట్టుతో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ ఓపెనర్ బ్యాట్స్ మెన్ అభిషేక్ శర్మ రికార్డుల మీద రికార్డులను సొంతం చేసుకున్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ నిర్ణీత ఓవర్లల్లో ఆరు వికెట్లను కోల్పోయి పరుగులు చేసింది.
పంజాబ్ బ్యాటర్స్ లో శ్రేయాస్ అయ్యర్ 82(36), పి సింగ్ 42(23), ప్రియాన్స్ ఆర్య 36(13) పరుగులతో రాణించారు. హైదరాబాదీ బౌలర్లల్లో పటేల్ 4/42, మలింగ 2/45 రాణించారు.246 భారీ లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ కు దిగిన ముందు నుండి ఒకవైపు అభిషేక్ సిక్సర్ల.. ఫోర్లతో చెలరేగి ఆడాడు. మరోవైపు హెడ్ తనకు పూర్తిగా భిన్నమైన ఆటతో అండగా నిలిచాడు.
ఈ క్రమంలోనే అభిషేక్ 55బంతుల్లో 141 పరుగులు చేశాడు. ఇందులో 14*4,10*6 లు ఉన్నాయి. ఐపీఎల్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన భారత బ్యాట్స్ మెన్ గా రికార్డుకెక్కాడు. అంతేకాకుండా పంజాబ్ ఆల్ రౌండర్ జాన్షన్ వేసిన పదో ఓవర్లో అభి కొట్టిన 106మీ. సిక్సర్ తో మరో రికార్డును సొంతం చేసుకున్నడు.
