మగవారికి అభిషేక్ బచ్చన్ సలహా…!

Abhishek Bachchan’s advice for men…!
పెళ్లి చేసుకున్న మగవారికి ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ఓ సలహా ఇచ్చారు. ప్రముఖ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ ,అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారు. త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారు అని వార్తలు ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియా.. అటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెల్సిందే.
ఈ వార్తలను బిగ్ బి అమితాబ్ బచ్చన్ సైతం ఖండించారు. తాజాగా ” ఫిల్మ్ ఫేర్ ఓటీటీ అవార్డుల వేడుకకు ఆయన హజరై పలు టిప్స్ చెప్పారు.
ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ పెళ్లైన వారంతా మీ భార్యలు చెప్పింది చేయండి అన్నారు. దీంతో తాను తన భార్య వింటున్నాను. విడాకులు ఎందుకు తీసుకుంటానని అభిషేక్ చెప్పకనే చెప్పారని కొందరంటున్నారు.
