హైదరాబాద్ లో వింత సంఘటన

 హైదరాబాద్ లో వింత సంఘటన

Loading

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని  నల్లకుంట విద్యా నగర్ లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది.. ఓ మహిళ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై పాము విసిరిన సంఘటన వెలుగులోకి వచ్చింది ..

విద్యా నగర్ వద్ద మద్యం మత్తులో ఆర్టీసీ బస్సు ఆపే ప్రయత్నం చేసింది మహిళ.. అయితే బస్సు ఆపకుండా  డ్రైవర్ వెళ్ళిపోయింది.. దీంతో సదరు మహిళ ఆగ్రహంతో బస్సు పై బీర్ బాటిల్ తో దాడి చేసింది…

దీంతో బస్సులో వెనుక భాగంలోని అద్దం ధ్వంసం అయింది . దీంతో బస్సు ఆపి మహిళను డ్రైవర్ పట్టుకునే ప్రయత్నం చేశాడు… దీంతో ఆగ్రహంతో బస్సు డ్రైవర్ పై తన వద్ద ఉన్న పామును విసిరింది మహిళ.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *