హైదరాబాద్ ఘన విజయం…!

 హైదరాబాద్ ఘన విజయం…!

Loading

ఐపీఎల్ -2025 లో భాగంగా ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ ,రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ నలబై నాలుగు పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ మొత్తం ఓవర్లు ఆడి 287పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్ఆర్ ముందు ఉంచింది.

భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఆర్ఆర్ ఇరవై ఓవర్లు ఆడి ఆరు వికెట్లను కోల్పోయి కేవలం 242పరుగులు మాత్రమే చేసింది. అయితే కక్ష్య చేధనలో ఆర్ఆర్ బ్యాట్స్ మెన్స్ ముందు నుండి రన్ రేటు పదికి తగ్గకుండా ఆడారు. ఆర్ఆర్ బ్యాటర్లలో జురేల్ (70), శాంసన్ (66) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడినా ఫలితం లేకపోయింది.

హైదరాబాద్ తరపున సమర్జీత్ 46/2, హర్షల్ 34/ 2 వికెట్లు తీశారు.మరోవైపు హైదరాబాద్ బ్యాటర్లో ఇషాన్ కిషాన్ నలబై ఏడు బంతుల్లో 11×4, 6×6 ల సాయంతో 106పరుగులతో నాటౌటుగా నిలవగా హెడ్ 67,నితీశ్ కుమార్ రెడ్డి 30(15, 4×4,1×6),హెన్ రిచ్ 34(14,5×4,1×6)లు రాణించారు. ఆర్ఆర్ బౌలర్లలో తుషార్ దేశ్ పాండే 44/3,మహీష్ 52/2 లు రాణించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *