ఎమ్మెల్యే ఆదిమూలం పై కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్ అధికార టీడీపీకి చెందిన తిరుపతి జిల్లా సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణ చేసిన సంగతి తెల్సిందే. దీంతో టీడీపీ జాతీయ ఆధిష్టానం సదరు ఎమ్మెల్యే పై సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెల్సిందే.
బాధితురాలి పిర్యాదు మేరకు ఎమ్మెల్యే ఆదిమూలంపై తిరుపతి తూర్పు పీఎస్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, నేను ఎలాంటి తప్పు చేయలేదు. నేను ఎవర్ని వేధించలేదు. అని ఆయన అన్నారు.
రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక వైసీపీ నేతలు కుట్ర చేశారు. టీడీపీకి నష్టం చేకూర్చను. ఆధిష్టానం నిర్ణయాన్ని శిరసావహిస్తాను. మహిళను అడ్డుపెట్టుకుని నాపై నిందలు వేశారు అని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆరోపించారు.