క్యాంప్ కార్యాలయంపై దాడి ఘటనను ఖండించిన హారీష్ రావు
సిద్ధిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై శుక్రవారం ఆర్ధరాత్రి కాంగ్రెస్ శ్రేణులు దాడి చేశారు..ఈ దాడిలో క్యాంప్ కార్యాలయంలోని వస్తువులను ధ్వంసం చేయడమే కాకుండా ఫ్లెక్సీలు,హోర్డింగ్స్ ను చింపేశారు..
ఈ ఘటనపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు స్పందించారు.. ఆయన స్పందిస్తూ “ఓ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి చేయడం హేయం..
ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం అప్రజాస్వామికం.. ప్రజాప్రతినిధుల క్యాంప్ కార్యాలయాలకే రక్షణ లేకపోతే ప్రజలకు ఏమి రక్షణ ఉంటుంది..వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్ర డీజీపీని కోరారు..