టీమిండియా బౌలింగ్ కోచ్ గా మోర్నీ మోర్కెల్ ఎందుకంటే..?
టీమిండియా బౌలింగ్ కోచ్ గా దక్షిణాఫ్రికాకు చెందిన మాజీ సీనియర్ బౌలర్ మోర్నీ మోర్కెల్ ను ఎంపిక చేసిన సంగతి తెల్సిందే. హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ ను ఎంపిక చేసిన కానీ బౌలింగ్ కోచ్ గా టీమిండియాకు చెందిన మాజీ బౌలర్లు లక్ష్మీపతి బాలాజీ,వినయ్ కుమార్ల పేర్లు విన్పించాయి. వీరిలో ఒకర్ని ఎంచుకోవడం ఖాయం అని అందరూ అనుకున్నారు.
కానీ ఎవరూ ఊహించని విధంగా దక్షిణాఫ్రికా మాజీ బౌలర్ మోర్నీ మోర్కెల్ ఖరారు అయ్యారు. అయితే మోర్కెల్ ను ఎందుకు ఎంచుకున్నారు అంటే అందుకు గల కారణాలను బీసీసీఐ వెల్లడించింది. భారత్ ఈ ఏడాది అస్ట్రేలియాలో పర్యటించనున్నది.
వచ్చేడాది ఇంగ్లాండ్ లో ఐదు టెస్టుల సిరీస్ ఆడనున్నది. మోర్కెల్ ఈ దేశాల్లో విజయవంతమయ్యారు. భారత ఆటగాళ్లతో ఆయనకు చక్కని అనుబంధం ఉంది. దీంతోనే బోర్డు మోర్కెల్ వైపు మొగ్గుచూపింది అని మోర్కెల్ ఎంపిక వెనక ఉన్న కారణాలను తెలిపింది.