అరవింద్ కేజ్రీవాల్ కు బిగ్ షాక్

 అరవింద్ కేజ్రీవాల్ కు బిగ్ షాక్

BIG Shock To Aam Aadmi Party Arvind Kejriwal

ఢిల్లీ ముఖ్యమంత్రి.. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు లెప్టినెంట్ గవర్నర్ వికె సక్సెనా బిగ్ షాకిచ్చారు. ఈ నెల పదిహేనో తారీఖున దేశ రాజాధాని మహానగరం  న్యూఢిల్లీలో ఆప్ ప్రభుత్వం నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆప్ నేత, హోం మంత్రి కైలాశ్ గెహ్లాట్ పాల్గొనాలని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు.

దీంతో చాత్రశాల్ స్టేడియంలో నిర్వహించే ఈ వేడుకల్లో హోం మంత్రి కైలాశ్ గెహ్లాట్ పాల్గొవడమే కాకుండా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం తరఫున త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు. ఈ మేరకు రాజ్ నివాస్ ఈరోజు మంగవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

ఈ వేడుకల కోసం చాత్రశాల్ స్టేడియంను ముస్తాబు చేయాలని.. లెఫ్టినెంట్ గవర్నర్ అధికార నివాసం రాజ్‌నివాస్ సెక్రటరీ అషీశ్ కుంద్రా ఈ మేరకు కేజ్రీవాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేశ్ కుమార్‌కు ఆదేశాలు జారీ చేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *