ఈ నెల21న తెలంగాణలో బీజేపీ వర్క్ షాప్

BJP is not against caste census
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నాయకత్వంలో నాంపల్లి బీజేపీ కార్యాలయంలో ఈ నెల 21న బీజేపీ వర్క్ షాప్ కార్యక్రమం జరగనున్నది.ఈ వర్క్ షాప్ లో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతం గురించి సుధీర్ఘ సమావేశం జరగనున్నది.
ఈ వర్క్ షాప్ కు బీజేపీ పదాధికారులు,రాష్ట్ర,జిల్లా మండల గ్రామ స్థాయి నాయకులు,అధ్యక్షులు తదితరులు పాల్గోనున్నారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా బీజేపీ వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు కిషన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. యాబై లక్షల మంది బీజేపీ సభ్యత్వ నమోదు లక్ష్యంగా పని చేయనున్నట్లు తెలిపారు.
త్వరలో జరగనున్న పంచాయితీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్ల బీజేపీ అభ్యర్థులు బరిలోకి దిగేలా.. వారి గెలుపుకు ఎలా ముందుకు పోవాలి. గత పదేండ్లుగా పంచాయితీ,స్థానిక సంస్థలకు కేంద్రంలోని బీజేపీ సర్కారు ఇచ్చిన నిధులు,చేసిన సంక్షేమాభివృద్ధి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలను రూపోందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.