Breaking News :- రేపు తెలంగాణ వ్యాప్తంగా ఓపీ సేవలు బంద్
తెలంగాణ వ్యాప్తంగా రేపు బుధవారం ఓపీ సేవలను బహిష్కరిస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. కోల్ కత్తా లో జూనియర్ డాక్టర్ హత్యాచారానికి గురైన బాధితురాలికి న్యాయం చేయాలి.. వారి కుటుంబానికి అండగా నిలబడాలని డిమాండ్ చేస్తూన్నారు జూడాలు..
జరిగిన సంఘటనను నిరసిస్తూ ఓపీ సేవలకు దూరంగా ఉంటున్నట్లు జూడాలు ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు అందజేశారు జూడాలు. దీంతో రేపు రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆస్పత్రుల్లో వైద్యసేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది.