కంట తడిపెట్టిన రష్మిక
తన కెరీర్ తొలినాళ్లలో మూవీ అడిషన్స్ కు వెళ్లిన ప్రతిసారీ కన్నీళ్లతోనే ఇంటికి తిరిగి వచ్చేదాన్నని హీరోయిన్.. నేషనల్ క్రష్.. హాట్ బ్యూటీ రష్మిక మందన్నా అన్నారు.
ఒక సినిమాకు ఎంపిక జరిగిన తరువాత దాదాపు 2, 3 నెలల పాటు వర్క్ షాప్స్ జరిగేవి.. కానీ కొద్ది రోజులకే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందని ఓ ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ చెప్పుకొచ్చారు.
అయితే ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి సినిమాకు తనను తాను మెరుగుపరుచుకుంటున్నానని నేషనల్ క్రష్ తెలిపారు. ప్రస్తుతం పుష్ప–2, సికిందర్, కుబేర వంటి చిత్రాలతో ఈ హాట్ బ్యూటీ బిజీ బిజీగా ఉన్నారు.