రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా బండి సంజయ్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. కాంగ్రెస్ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ పని చేస్తున్నారు అని కుత్భుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కెపి వివేకానంద సంచలన వ్యాఖ్యలు చేశారు…
ఈరోజు ఆదివారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతూ “ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తమ్ముడు పెట్టుబడులు పెడుతుంటే మేము కాదనడంలేదు.. అవన్నీ ఫేక్ కంపెనీలు అని రుజువులున్న కానీ బండి సంజయ్ ఎందుకు మాట్లాడటంలేదు..
వాటిన్నంటిని కేంద్ర ప్రభుత్వం సమర్థిస్తుందా అని ప్రశ్నించారు.. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేయాల్సినవసరం మాకు లేదు..ఎమ్మెల్యేల అనర్హత గురించి ఢిల్లీ వెళ్లడం కూడా తప్పేనా అని ఆయన బండి సంజయ్ ను సూటిగా ప్రశ్నించారు…