సంయుక్త మీనన్ గోల్డెన్ హార్ట్

Samyuktha Menon Golden Heart help for Wayanad
ఇటు అందం, అటు అభినయంతో సినీ ప్రేక్షకుల్ని అలరిస్తున్న హీరోయిన్ సంయుక్తా మీనన్.. తన మానవత్వంతో ఆదర్శంగా నిలుస్తున్నారు.
సరిగ్గా ఆరెండ్ల కిందట అంటే 2018 కేరళ వరదల సమయంలో ఆర్థిక సాయం చేయడంతోపాటు స్వయంగా సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఇటీవల వయనాడ్ కోసం సైతం తాను సాయం అందించారు. నిస్సహాయ స్త్రీలను ఆదుకునేందుకు ఆదిశక్తి ఫౌండేషన్ స్థాపించి సేవ చేస్తున్నారు. హీరోయిన్ గా పొందిన ప్రేమను మనిషిగా తిరిగిస్తున్నానని ఆమె చెబుతున్నారు.