వినేశ్ ఫొగట్ పై కుట్ర
వంద గ్రాముల బరువు ఉందనే నెపంతో ఒలింపిక్స్ ఫైనల్ మ్యాచ్ కు అనర్హత కు గురైన భారత్ రైజర్ వినేశ్ ఫొగట్ కు దేశ వ్యాప్తంగా మద్ధతు వస్తుంది.. వినేశ్ ఫొగట్ అనర్హత వేటు వెనుక ఖచ్చితంగా ఏదో కుట్ర జరిగిందని ఒలింపిక్స్ మెడలిస్ట్ విజేందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆ వంద గ్రాముల్ని తగ్గించేకునేందుకు ఒలింపిక్స్ కమిటీ ఓ అవకాశాన్ని ఇవ్వాల్సింది. ఇలాంటిది నేనేప్పుడూ చూడలేదు.. భారత రెజర్లపై ఏదో కుట్ర జరుగుతుంది. బహుశా మన సంతోషాన్ని కొంతమంది చూడలేకపోతున్నారు.
ఒక రాత్రిలోనే ఐదారు కిలోల బరువు తగ్గగలము.. అలాంటిది వందగ్రాములు తగ్గలేమా.?. వినేశ్ నువ్వు చాంపియన్లకే చాంపియన్. ఎంతోమందికి నువ్వు ఆదర్శం. ఇక్కడ ఎన్నో అవమానాలను.. కుట్రలను ఎదుర్కోని ఇక్కడదాక వచ్చావు.. నీకు నా పూర్తి మద్ధతు అని “అన్నారు.