వినేశ్ ఫొగట్ కు అస్వస్థత
భారత రైజర్ల వినేశ్ ఫొగట్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. డీహైడ్రేషన్ కారణంగా వినేశ్ తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో అధికారులు ఆమెను ఆసుపత్రికి చేర్చారు. రాత్రికి రాత్రే రెండు కిలోల బరువు తగ్గడానికి జాగింగ్,స్కిప్పింగ్ లాంటివి చేయడం జరిగింది.
దీంతో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో పారిస్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే వందగ్రాముల బరువు ఎక్కువగా ఉండటంతో యాబై కిలోల వెయిట్ లిప్టింగ్ విభాగంలో ఫైనల్ మ్యాచ్ కు ముందు వినేశ్ పై అనర్హత వేటు వేశారు.
ఈ నిర్ణయం పట్ల దేశమంతటా నిరసన జ్వాలలు విన్పిస్తున్నాయి.. ఏకంగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఒలింపిక్స్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషాకు కాల్ చేసి వివరాలు అడిగారు. ఏమైన వీలు ఉంటే వినేష్ ను ఫైనల్ మ్యాచ్ లో ఆడించాలని ఒలింపిక్స్ సంఘాన్ని మోదీ కోరారు.