దానం నాగేందర్ కు పాడి కౌశిక్ రెడ్డి సవాల్
బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు.” దమ్ముంటే హైదరాబాద్ లో ఎక్కడకి రావాల్నో చెప్పాలి.. అక్కడకి మేము వస్తాము..
ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరిన దానం నాగేందర్ రాజీనామా చేసి మళ్లీ గెలవాలి.జాబ్ క్యాలెండర్ స్పష్టత లేకుండా తెల్లపేపర్ పై రాతలు రాసి చెబితే అది జాబ్ క్యాలెండర్ అని నిరుద్యోగ యువత నమ్మాల్నా..?. ఇప్పటికైన పార్టీ మారిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహారి,దానం నాగేందర్ లాంటి ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి..
లేకపోతే కోర్టే మీకు నోటీసులు పంపుతుందని ” పాడి కౌశిక్ రెడ్డి హెచ్చారించారు. నిన్న అసెంబ్లీలో దానం నాగేందర్ మాట్లాడుతూ ” దమ్ముంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో తిరగాలి.. బయట తిరగరు అంటూ పరుషపదజాలంతో దూషించిన సంగతి తెల్సిందే.