దేవర నుండి బిగ్ అప్డేట్

ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్ రేంజ్ కు ఎదిగిన టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర మూవీలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు..
హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ.. హాట్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తూ ఎన్టీఆర్ తో రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతుంది..ఇప్పటికే మస్త్ హైప్ తెచ్చుకున్న ‘దేవర’ సినిమా నుంచి తాజా అప్డేట్ ఒకటి వచ్చింది. దేవరకు సంబంధించి సెకండ్ సింగిల్ ను ఈనెల 15న విడుదల చేయనున్నట్లు చిత్రం యూనిట్ ప్రకటించారు.
ఈ న్యూ లుక్ లో హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ తో కల్సి ఎన్టీఆర్ స్టెప్పులేసినట్లు ఒక ఫోటో విడుదల చేశారు. ఇందులో జూనియర్ లుక్ ఆకట్టుకుంటోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘దేవర’ పార్ట్-1 సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న సంగతి తెల్సిందే…

