7నెలల్లోనే 40వేల ఉద్యోగాలు ఇచ్చాము

 7నెలల్లోనే 40వేల ఉద్యోగాలు ఇచ్చాము

Minister Duddilla Sridhar Babu

Loading

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడు నెలల్లోనే నలభై వేల ఉద్యోగాలు ఇచ్చాము అని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ “అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాము..

జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము అని “హామీ ఇచ్చాము.. హామీ ఇచ్చినట్లుగానే వచ్చిన ఏడు నెలల్లోనే నలభై వేల ఉద్యోగాలు ఇచ్చాము.. త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము.. కాంగ్రెస్ అంటే అన్ని వర్గాల క్షేమం గురించి ఆలోచించే పార్టీ..

నిరుద్యోగ యువతకోసం అనేక పథకాలను తీసుకొస్తాము.. స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించి ఉపాధి అవకాశాలు కల్పిస్తాము అని “అన్నారు..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *