రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు
దేశంలోని రిజర్వేషన్లపై దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఏడుగురు సభ్యుల బెంచ్ లో ఎస్సీ వర్గీకరణకు మద్ధతుగా తీర్పునిచ్చింది.
విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వర్గీకరణ ఉపయోగపడుతుంది.. వర్గీకరణపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు అధికారం ఉంది.. ఇది చారిత్రాత్మకమైన తీర్పుగా సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
2004లో ఇచ్చిన తీర్పును పక్కకు పెట్టి మరి వర్గీకరణకు మద్ధతుగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.. 6:1 మెజార్టీ సభ్యుల మద్ధతుతో తీర్పును వెల్లడించిన సీజేఐ చంద్రచూడ్ బృందం.అయితే ఈ తీర్పును జస్టీస్ బేలా త్రివేది వ్యతిరేకించారు.