వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి కి మరో షాక్..
ఏపీ ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన పల్నాడు జిల్లా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ సీనియర్ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరోసారి చుక్కెదురైంది.
గుంటూరు జిల్లా కోర్టు ఆయనకు బెయిల్ నిరాకరించింది. గతంలో సెషన్స్ కోర్టు బెయిల్ ఇవ్వకపోవడంతో ఆయన జిల్లా కోర్టును ఆశ్రయించారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో కారంపూడి సీఐ, టీడీపీ ఏజెంట్ లపై దాడి చేశారనే అభియోగాలతో పిన్నెల్లిపై కేసు నమోదైంది. ప్రస్తుతం పిన్నెల్లి నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.