పారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో పతకం
పారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్‌లో భారత్ రెండో మెడల్ కొట్టింది . 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని దక్కించుకుంది. షూటర్ మనూ భాకర్ ఖాతాలో మరో మెడల్ పడింది.
మిక్స్‌డ్ టీమ్‌లో మనూ భాకర్‌తో పాటు సరబ్‌జోత్ సింగ్ ఉన్నారు. కొరియా జంటపై భారత షూటర్లు మేటి ఆటను ప్రదర్శించారు. ఈ మెడల్‌తో షూటర్ మనూ భాకర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. స్వతంత్ర భారత్‌లో ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన అథ్లెట్‌గా మనూ భాకర్ నిలవడం విశేషం.