మెగా అభిమానులకు శుభవార్త
మెగా అభిమానులకు అదిరిపోయే శుభవార్తను తెలిపారు హిట్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్.. ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ అనే మూవీ ని తెరకేక్కిస్తున్న సంగతి తెల్సిందే.. ప్రస్తుతం హరీష్ శంకర్ ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉన్నారు..
అందులో భాగంగా దర్శకుడు మాట్లాడుతూ “మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలను ముగ్గుర్ని పెట్టి ఓ చిత్రం తీద్దామని ఓ స్టోరీ లైన్ రాసుకున్నాను.. నేను రాసిన కథ ఈ ముగ్గుర్కి నచ్చుతుంది..
ఈ చిత్రం విడుదల అయినాక పాన్ ఇండియా మూవీ లెవల్ దాటి ఘన విజయం సాధిస్తుంది..అంత బాగుంటుంది అని “మీడియా చిట్ చాట్ లో చెప్పారు.. గతంలో పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్, వరుణ్ తేజ్ తో గద్దల కొండ గణేష్ చిత్రాలను తీసిన సంగతి తెల్సిందే.