హీరో ధనుష్ కు షాక్
ప్రముఖ తమిళ హీరో ధనుష్ కు తమిళ నిర్మాత మండలి big షాకిచ్చింది.. హీరో ధనుష్ తో పాటు అడ్వాన్సులు తీసుకొని షూటింగ్ లు పూర్తిచేయని నటీనటులపై తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆంక్షలు విధించింది.
ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న సినిమాలను పూర్తి చేశాకే కొత్తవాటికి కాల్ షీట్స్ ఇవ్వాలని నిర్మాత మండలి వాళ్లకు తేల్చి తెలిపింది.
అంతే కాకుండా ఇక నుండి తమిళ ఇండస్ట్రీ లో ఏ హీరో అయిన హీరోయిన్ అయిన కూడా అడ్వాన్సులు తీసుకోవద్దని పేర్కొంది.
ఇండస్ట్రీ లోని నిర్మాతల ఫిర్యాదుతో హీరో ధనుష్ వ్యవహారంపై అసోసియేషన్ సీరియస్ అయింది. తమను సంప్రదించాకే ఆయనతో సినిమా తీయాలని కూడా ఈ సందర్భంగా ఆదేశాలు ఇవ్వడం గమనార్హం…