ఓఆర్ఆర్ లీజు రద్ధు
గత బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయేవరకు ఓఆర్ఆర్ ను వేలం వేసుకొని ముప్పై ఏండ్ల పాటు వచ్చే ఆదాయాన్ని ఒక్క ఏడాదిలోనే తీసుకున్నారు అని శాసనసభలో బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చలో ఉప ముఖ్యమంత్రి.. ఆర్ధిక శాఖ మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు అన్నారు..
ఆయన ఇంకా మాట్లాడుతూ ఆ లీజుపై విచారణ చేయించి అవసరమైతే రద్ధు చేస్తాము.. పడేండ్లలో ఆరోగ్య శ్రీపై బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు వేల మూడోందల ఇరవై కోట్లు ఖర్చు చేస్తే మేము ఒక్క ఏడాదికే ఒక వేయి అరవై మూడు కోట్లు ఖర్చు చేయబోతున్నాము..
ఈ ఏడాది బడ్జెట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ సబ్ ప్లాన్ కు 33,124కోట్లు, ఎస్టీ సబ్ ప్లాన్ కు 17,056కోట్లు, బీసీ సబ్ ప్లాన్ కు 10,028కోట్లు, మైనార్టీల సబ్ ప్లాన్ కు 3,002కోట్లు కేటాయించాము అని ఆయన తెలిపారు..