మదనపల్లె సంఘటనలో బిగ్ ట్విస్ట్
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధంపై సంచలన విషయాలను డీజీపీ ద్వారకా తిరుమలరావు బయటపెట్టారు. అయన మీడియా తో మాట్లాడుతూ “మదనపల్లె ఘటన ప్రమాదం కాదు.
గత రాత్రి 11:30 గంటలకు అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదం పలు అనుమానాలకు తావిస్తోంది. ఘటన ప్రమాదవశాత్తు జరిగింది కాదు. రాత్రి ప్రమాదం జరిగితే వెంటనే కలెక్టర్‌కు సమాచారం ఇవ్వలేదు. ఆర్డీవో ఆఫీస్‌లో కీలక ఫైల్స్ ఉన్న విభాగంలో అగ్నిప్రమాదం జరిగింది.
ఆర్డీవో కార్యాలయం కిటికీ బయట అగ్గిపుల్లలు కనిపించాయి. వోల్టేజ్ తేడాలు లేవు.. షార్ట్ సర్క్యూట్‌కు అవకాశమే లేదు. ఆర్డీవో ఆఫీస్‌లో కొన్ని సీసీ కెమెరాలు పనిచేయట్లేదు. త్వరలో అన్ని వివరాలు బయటికొస్తాయి” అని అన్నారు.