లోక్ సభలో నీట్ దుమారం
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ పై చర్చకు ఈరోజు ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు పట్టుపట్టాయి.. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ పై సీబీఐ లాంటి సంస్థలతో విచారణ చేయించాలి..దోషులను కఠినంగా శిక్షించాలి అని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి..
ఈ క్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ” నీట్ పరీక్ష పేపర్ లీకేజీ సంఘటనపై సీబీఐతో విచారణ చేయించాలి.. డబ్బులున్నోళ్ళే విద్యావ్యవస్థను శాసిస్తున్నారు..విద్యవ్యవస్థలో ఉన్న సమస్యలను మూలాల నుండి పేకిలించాల్సి ఉంది అని ” ఆయన అన్నారు..
దీనికి సమాధానంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ నీట్ పరీక్షను తీసుకు వచ్చిందే నాటి ఎన్డీఏ కూటమి.. నేడు నీట్ గురించి తప్పుగా మాట్లాడుతుంది.. మొత్తం విద్యావ్యవస్థనే తప్పుపడుతున్నారు అంటూ చేసిన వ్యాఖ్యలతో నీట్ పై పెద్దదుమారం రేగింది..