రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రుణమాఫీపై కీలక వ్యాఖ్యలు చేశారు.. ప్రజాభవన్ లో ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీ..మంత్రులు..ప్రజాప్రతినిధులతో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుతో కల్సి పాల్గోన్నారు..
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ యావత్ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఒకేసారి ముప్పై ఒక్కవేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేసిన చరిత్ర లేదు.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి రైతును రుణ విముక్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యం.ప్రతి రైతు అప్పులేకుండా తల ఎత్తుకుని జీవించాలన్నదే మన అభిమతం.
రేపు సాయంత్రం నాలుగు గంటల్లోపు లక్ష లోపు రుణాలన్నీ మాఫీ అవుతాయి..నేరుగా రైతు ఖాతాలోనే ఈ నిధులు జమ అవుతాయి.. ఈ నెలాఖరులోపు లక్షన్నర లోపు రుణాలను మాఫీ చేసి తీరుతాము.. ఆగస్టులోపు రెండు లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తాము.. రేషన్ కార్డు లేని ఆరులక్షల మంది రైతుల రుణాలను కూడా మాఫీ చేసి తీరుతామని తెలిపారు..
రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని కార్యకర్తల దగ్గర నుండి ఎమ్మెల్యే..ఎమ్మెల్సీ..మంత్రుల వరకు అందరూ కాలర్ ఎగరేసుకుని క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించాలి.. రాబోయే ఇరవై ఏండ్లు గుర్తుకు ఉండేలా రుణమాఫీ చేయబోతున్నాము..రుణమాఫీపై మనకు చిత్తశుద్ధి ఉంది..అందుకే ఒకే విడతలో చేస్తున్నాము అని పేర్కొన్నారు..