విశాఖ వాసులకు శుభవార్త

 విశాఖ వాసులకు శుభవార్త

ఏపీలోని విశాఖపట్టణం వాసులకు రాష్ట్ర పర్యాటక శాఖ ఓ శుభవార్తను తెలిపింది. తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి ఓ ప్రత్యేక ఫ్యాకేజీని సిద్ధం చేసింది.

ఈ ఫ్యాకేజీలో భాగంగా ఈ నెల పంతోమ్మిదో తారీఖు నుండి విశాఖ నుండి ప్రతి రోజూ మధ్యాహ్నాం మూడు గంటలకు తిరుమలకు ఏసీ బస్సు బయలుదేరుతుంది. విశాఖ నుండి రాజమండ్రి,శ్రీకాళహస్తి మీదుగా తిరుపతికి ఈ బస్సు చేరుతుంది.

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం ,పద్మావతి అమ్మవారి దర్శనం భక్తులకు చేయించి విశాఖకు తిరుగు ప్రయాణం కానున్నది. అయితే ఇందుకుగాను పెద్దలకు రూ 6,300, పిల్లలకు 6,000గా టికెట్ ధరలను నిర్ణయించింది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *