సమంతలో మార్పుకు అదే కారణం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి సమంత తనలో వచ్చిన మార్పుకు కారణం ఏంటో తెలియజేశారు..ఓ కార్యక్రమంలో సమంత మాట్లాడుతూ తమ జీవితంలో కొన్ని మార్చుకోవాలని చాలా మంది కోరుకుంటారు..
కానీ అది సాధ్యం కాదని ఆమె అన్నారు. సవాలు ఎదురైనప్పుడు దానిని అధిగమించి ముందుకెళ్లాలని చెప్పారు. మునుపటికంటే ఇప్పుడే తాను స్ట్రాంగ్ అయ్యానని తెలిపారు.
అయితే తాను అనుసరించిన ఆధ్యాత్మిక చింతన తనలో మార్పు తీసుకొచ్చిందని పేర్కొన్నారు. మరోవైపు సమంత నటించిన ‘సిటడెల్: హనీ-బన్నీ’ విడుదలకు సిద్ధంగా ఉంది.