అగ్నిపథ్ పథకంపై మోదీ సర్కారు కీలక నిర్ణయం
2022 జూన్ 14న ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం అగ్నిపథ్ . ఈ పథకం కింద ఇరవై మూడు ఏండ్ల లోపు ఉన్న యువతను నాలుగేండ్ల పరిమితితో కేంద్ర సాయుధ దళాల్లోకి తీసుకుంటున్నారు.
అయితే తాజాగా ఈ పథకం గురించి మోదీ సర్కారు కీలక ప్రకటన చేసింది. అగ్నిపథ్ పథకంలో భాగంగా సాయుధ బలగాల్లోకి పది శాతం కానిస్టేబుల్ పోస్టులని మాజీ అగ్నివీర్‌లకు రిజర్వ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) హెడ్‌క్వార్టర్స్‌లో ప్రభుత్వం మినహాయింపు ఇస్తుంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని సీఐఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ నీనా సింగ్ ఈ సందర్బంగా తెలిపారు.