భారతీయుడు -2 కు గ్రీన్ సిగ్నల్
భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా వస్తున్న భారతీయుడు -2 సినిమా విడుదలకు మధురై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాను రాసిన పుస్తకం ఆధారంగా మూవీ లో మర్మకళ సన్నివేశాలను చిత్రీకరించారు..
ఈ సన్నివేశాలపై రాజేంద్రన్ అనే రచయిత అభ్యంతరం వ్యక్తం చేస్తూ సినిమా విడుదలను ఆపేయాలని మధురై కోర్టును అశ్రాయించారు.
దీనిపై ఈరోజు గురువారం విచారించి సినిమా విడుదలపై స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పింది…పార్ట్-1లోని సన్నివేశాలు కొనసాగించామని నిర్మాతలు కోర్టుకు చెప్పడంతో
రాజేంద్రన్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది..