NHAI అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
తెలంగాణలో చేపట్టిన జాతీయ రహదారుల నిర్మాణంలో భూ సేకరణతో పాటు ఇతరత్రా ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించడానికి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయించారు.
భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఉన్నతాధికారులు సీఎం గారితో సమావేశంకాగా, జాతీయ రహదారుల నిర్మాణంలో ఎదురయ్యే ఆటంకాలను తొలగించడంలో ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డును భారత్మాల పరియోజన పథకం కింద చేర్చాలని కోరారు. వైబ్రెంట్ తెలంగాణ లక్ష్య సాధనలో ఈ రింగ్ రోడ్డు ప్రాధాన్యతను సీఎంగారు వివరించారు.
రాష్ట్రంలో ప్రతిపాదిత జాతీయ రహదారుల నిర్మాణంపై ప్రతి వారం నివేదికలు ఇవ్వాలని సీఎంగారు అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారుల నిర్మాణంలో NHAI లేవనెత్తిన పలు అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం గారు వివరించారు.