కొత్త ఫించన్ల పై మంత్రి సీతక్క క్లారిటీ
తెలంగాణ రాష్ట్రంలో కొత్త పింఛన్ల జారీకి అర్హుల జాబితాను సిద్ధం చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెండింగులో ఉన్నవి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అందిన దరఖాస్తుల ఆధారంగా రిపోర్ట్ చేయాలని ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి సీతక్క సూచించారు.
చేయూత పథకం కింద పింఛన్ల మొత్తాన్ని పెంచుతామని తెలిపారు. గత ప్రభుత్వం పొదుపు సొమ్మును పక్కదారి పట్టించిందని, ఆ వివరాలను ప్రభుత్వానికి అందించాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు.