BJP అంటే బాబు జగన్ పవన్
వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల హృదయాల్లో వైఎస్ చెరగని ముద్ర వేశారు. ఏపీ, తెలంగాణలో వైఎస్ కు లక్షలాదిమంది అభిమానులు ఉన్నారు.వైఎస్ తో నాకు ప్రత్యేకమైన అనుభవం ఉంది. మొదటిసారిగా నేను శాసనమండలి సభ్యుడిగా సభకు వెళ్లినప్పుడు… వైఎస్ దృష్టిని ఆకర్షించేలా మాట్లాడాలని చాలా ప్రిపేర్ అయి వెళ్లేవాన్ని. నేను లేవనెత్తిన అంశాలపై నన్ను ప్రోత్సహించేందుకు ఆయన లేచి సమాధానం ఇచ్చేవారు.
ప్రతీ పోరాటానికి ఒక సమయం వస్తుంది.. ప్రజలు ఆదరిస్తారు. 1999లో వైఎస్ పోషించిన పాత్రను ఇప్పుడు షర్మిల పోషిస్తున్నారు. ప్రజల గొంతుకై షర్మిల ప్రజల తరపున మాట్లాడుతున్నారు.ఏపీలో బీజేపీ అధికారంలో ఉంది.. బీజేపీ అంటే బాబు జగన్ పవన్. రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు.. అంతా పాలకపక్షమే..
బాబు.. జగన్… పవన్ అందరూ మోదీ పక్షమే. ప్రజల పక్షాన నిలబడి కొట్లాడే నాయకురాలు షర్మిల. 2029లో ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు.వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లిన వారే ఆయన నిజమైన వారసులు. వైఎస్ పేరుతో రాజకీయ వ్యాపారాలు చేసేవాళ్లు ఆయన వారసులు కాదు.
షర్మిలకు మేమంతా అండగా నిలబడతామని చెప్పేందుకే మంత్రివర్గ సభ్యులతో కలిసి ఇక్కడికి వచ్చాము.కడప పార్లమెంట్ కు ఉప ఎన్నిక వస్తుందని కొందరు మాట్లాడుకుంటున్నారు. నిజంగా కడప పౌరుషాన్ని ఢిల్లీకి చాటే అవకాశం వస్తే… ఎన్నికల ప్రచారంలో గల్లీ గల్లీ తిరగడానికి నేను వస్తాను.
- మంగళగిరిలో నిర్వచించిన వైఎస్ఆర్ 75వ జయంతి సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.