టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్న నటి హేమ లేఖ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి హేమ ఇంకా వార్తల్లో నిలుస్తున్నారు..ఇటీవల కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు లో జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారనే నేపంతో అరెస్ట్ అయి బెయిల్ పై బయటకు వచ్చిన హేమ తాజాగా మా ఆసోషియేషన్ కు రాసిన లేఖ సంచలనం సృష్టిస్తుంది..
బెంగుళూరు ఉదాంతంతో నటి హేమకు మా ఆసోషియేషన్ లో ఉన్న సభ్యత్వాన్ని రద్ధు చేసింది.దీనిపై నటి హేమ స్పందిస్తూ బైలాస్ ప్రకారం తనకు ఎలాంటి ముందస్తుగా షోకాజ్ నోటీసులివ్వకుండా సభ్యత్వాన్ని ఎలా రద్ధు చేస్తారు.. రేవ్ పార్టీలో తనపై కేవలం ఆరోపణలు మాత్రమే ఉన్నాయి.
ఇంకా నేరం రుజువు కాలేదు..అయిన డ్రగ్స్ పరీక్షలో నేను నెగిటీవ్ వచ్చిన కూడా ఎలా సభ్యత్వాన్ని రద్ధు చేస్తారని మా అధ్యక్షుడు హీరో మంచు విష్ణును కల్సి వివరించి లేఖను అందజేశారు.. దీనిపై స్పందించిన మంచు విష్ణు అడ్వయిజరీ కమిటీలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని నటి హేమకు హామీచ్చినట్లు తెలుస్తుంది..