కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర
తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలోని సీఎల్పీ మీడియా పాయింట్లో ఆదివారం మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ నిర్వాకంతో పదవులు పోయాయని గులాబీ పార్టీనేత నిరంజన్ రెడ్డి లెటర్ రాయాలన్నారు.
నిరంజన్ రెడ్డి కృష్ణా నదిని కూడా ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఆయన అవినీతి అక్రమాలపై ప్రభుత్వం విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటుందని అన్నారు.
అవినీతి సంపాదనతో ఆ నాడు కేసీఆర్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని అన్నారు. గొప్ప, ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి రాహుల్ గాంధీకి లేఖ రాసే అర్హత లేదన్నారు.