చెల్లని కల్యాణలక్ష్మి చెక్కు ఇచ్చిన తహసీల్దారు..
మంచిర్యాల – కోటపల్లి మండలంలోని ఎదుల్లబంధం గ్రామానికి చెందిన జైనేని సరిత-శ్రీనివాస్ దంపతుల కూతురు మేఘన వివాహం 2023 ఫిబ్రవరి 23న జరిగింది.
కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోగా.. సరిత పేరిట 2024 ఏప్రిల్ 3న రూ.1,00,116కు సంబంధించిన చెక్కు మంజూరైంది.
ఆ చెక్కును లబ్ధిదారుకు మూడు నెలల తర్వాత బుధవారం కార్యాలయానికి పిలిచి మేఘన తల్లి సరితకు అందజేయగ.. చెక్కును మార్చుకునేందుకు బ్యాంకుకు వెళ్లిన సరిత సిబ్బందికి ఇచ్చారు.. వారు చెక్కు గడువు ముగిసిందని తిప్పి పంపించారు.
కల్యాణ లక్ష్మి చెక్కు వచ్చి మూడు నెలలవుతున్నా అధికారులు చెప్పలేదని.. చెల్లని చెక్కు ఇచ్చారని లబ్ధిదారు సరిత మరియు ఆమె కూతురు మేఘన ఆవేదన వ్యక్తంచేశారు.