నిరుద్యోగ యువతకు అండగా ఉంటాం
తెలంగాణ లోని గ్రూప్స్ అభ్యర్థుల డిమాండ్లు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కాంగ్రెస్ బల్మూరి వెంకట్ అన్నారు.
బీఆర్ఎస్, బీజేపీ నేతల ట్రాప్ లో నిరుద్యోగులు పడొద్దని సూచించారు. నిరుద్యోగుల ఆశలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని వెంకట్ తెలిపారు.
నిన్న నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్తో బల్మూరి చర్చలు విఫలమయ్యాయి. ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని జేఏసీ హెచ్చరించింది.