చార్జీల పెంపుపై మంత్రి క్లారిటీ
ఏపీలో బస్సు చార్జీల పెంపుపై మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి క్లారిటీచ్చారు.. ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఐదేండ్లలో వైసీపీ హయాంలో రవాణా శాఖ నిర్వీర్యమైందని, ఆర్టీసీలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించలేదు..
లీజుల పేరుతో వైసీపీ పార్టీకి చెందిన నేతలు ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీ భూములను రాష్ట్ర వ్యాప్తంగా కాజేశారు..వాటిపై తగిన విచారణ జరిపి తిరిగి వాటిని తాము వెనక్కి తీసుకుంటామని ఆయన చెప్పారు.
ప్రజల సొమ్ము తిన్నవారిని వదిలిపెట్టేది లేదని ఈసందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. తాము ఛార్జీలు పెంచకుండానే బస్సు సర్వీసులు పెంచి ప్రజలకు మంచి సేవలందిస్తామని తెలిపారు.