మధిరలో పైలెట్ ప్రాజెక్టుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.
అందులో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రాతినిథ్యం వహిస్తోన్న మధిర అసెంబ్లీ నియోజకవర్గం.. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్ లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని ఈరోజు జరిగిన సమీక్షా సమావేశంలో నిర్ణయించారు..
దీనికి సంబంధించిన నమునాలతో పాటు పలు అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ సమక్షంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,సీఎస్,సంబంధితాధికారులు చర్చించారు..ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనార్టీ వర్గాలకు చెందిన గురుకులాలు ఒకే చోట ఏర్పాటు చేయనున్నారు..ఇప్పటికే మధిర,కొడంగల్ లో ఇరవై ఎకరాల భూమిని సేకరించారు..