రేపు పవన్ తో సినీ నిర్మాతలు భేటీ
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం..జనసేనాని పవన్ కళ్యాణ్ తో విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సినీ నిర్మాతలు భేటీ కానున్నారు..
ఈ భేటీలో ఇండస్ట్రీలో నెలకొన్న పలు సమస్యలపై చర్చించనున్నారు..డిప్యూటీసీఎంగా..మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి సినీ నిర్మాతలు భేటీ కానుండటంతో ప్రాధాన్యత సంతరించుకున్నది.
ఈ సమావేశంలో పాల్గొననున్న అగ్ర నిర్మాతలు దిల్ రాజు, డీవీవీ దానయ్య, అశ్వినీదత్, చినబాబు, నవీన్, రవిశంకర్, నాగవంశీ, విశ్వప్రసాద్, బోగవల్లి ప్రసాద్ తదితరులు..