పవన్ కీలక ఆదేశాలు
ఏపీ ఉప ముఖ్యమంత్రి…జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు ఇచ్చారు.. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు సైన్స్ & టెక్నాలజీలో ఉన్న ప్రతిభను వెలికితీసేలా వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించాలని సంబంధితాధికారులను ఆదేశించారు.
కేంద్ర ప్రభుత్వ విజన్ 2047కు అనుగుణంగా ఆయా అధికారులు కార్యక్రమాలను చేపట్టాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు సైంటిస్టులుగా మారేందుకు అవసరమైన ప్రోత్సాహం అందించాల్సి ఉందని డిప్యూటీ సీఎం పవన్ చెప్పారు.
అంతేకాకుండా రాజమండ్రి ప్రాంతీయ వైజ్ఞానిక కేంద్రాన్ని త్వరలోనే ప్రారంభించాలని అధికారులకు పవన్ కళ్యాణ్ సూచించారు.